ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలవరం నీటి నిల్వ సామర్థ్యం తగ్గింపు సాధ్యం కాదు'

పోలవరం నీటి నిల్వ సామర్ధ్యం తగ్గించడం సాధ్యం కాదని.. ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజినీర్ ఏకే ప్రధాన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులను రెండు రోజులపాటు పరిశీలించేందుకు అథారిటీ బృందంతో కలిసి పర్యటించారు. ఇంజినీర్లు, అధికారులు, గత్తేదారులతో పనుల పురోగతిపై ఆరా తీశారు.

Project Authority team examining Polavaram
పోలవరంలో ప్రాజెక్ట్ అథారిటీ బృందం

By

Published : Dec 1, 2020, 2:30 PM IST

పోలవరంలో ప్రాజెక్ట్ అథారిటీ బృందం

మొదటి డీపీఆర్​లో ఎలా ఉందో ఆ విధంగానే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని.. ఎలాంటి మార్పులు ఉండవని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజినీర్ ఏకే ప్రధాన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేందుకు.. అథారిటీ బృందంతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను రెండు రోజులపాటు పరిశీలించనున్నారు.

ఈ సందర్శనలో భాగంగా.. ప్రాజెక్టు ఇంజినీర్లు, అధికారులు, గత్తేదారులతో పనుల పురోగతిపై ప్రధాన్ మాట్లాడారు. సాధ్యమైనంతవరకు అనుకున్న సమయానికే పనులు పూర్తిచేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. స్పిల్ వే తోపాటు ఇతర కాంక్రీటు పనులు 76 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణం మొత్తంగా 41 శాతం పూర్తయిందని స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details