ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జులై 4న రాష్ట్రానికి ప్రధాని మోదీ... చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం - Prime Minister Modi will arrive in the state on July 4th

జులై 4న రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపారు.

ప్రధాని మోదీ , చిరంజీవి
ప్రధాని మోదీ , చిరంజీవి

By

Published : Jun 28, 2022, 8:25 PM IST

వచ్చే నెల 4న రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నారు. జులై 4వ తేదీ ఉదయం 10.10 గం.కు విజయవాడకు ప్రధాని చేరుకుంటారు. అనంతరం 10.50 గం.కు హెలికాప్టర్‌లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళ్లనున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ పాల్గొంటారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా ఏర్పటు చేసిన 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించినున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో దాదాపు గంటంపావు పాటు ప్రధాని ఉండనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి దిల్లీ వెళ్తారు.

జులై 4న రాష్ట్రానికి ప్రధాని మోదీ... చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం

భీమవరంలో జరుగునున్న ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా జరుగనున్న అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details