పంచె కట్టి.. బ్యాట్ పట్టి.. - today Priests throwing sixes on the cricket field
వాళ్లంతా నిత్యం వేద మంత్రాలు పట్టిస్తూ.. శాస్త్రోక్తంగా దేవుడి పూజలు నిర్వహించే పురోహితులు. ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో తరించేవారు.. క్రికెట్ బ్యాట్, బాల్ చేత పట్టి క్రీడా మైదానంలో చెలరేగిపోయారు. ప్రొఫెషనల్ క్రీడాకారులకు తామేమీ తక్కువ కాదంటూ భీమవరంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్లో ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము లేపుతున్నారు.
![పంచె కట్టి.. బ్యాట్ పట్టి.. Priests throwing sixes on the cricket field](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11149042-1016-11149042-1616648151084.jpg)
ఆలయాల్లో పూజలు చేస్తూ.. ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలోనే ఉండే పురోహితులు.. క్రికెట్ మైదానంలో సిక్సర్లతో చెలరేగిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పురోహితుల కోసం.. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఎస్ఆర్కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్ పోటీలు.. ఉత్సాహంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ నుంచి మొత్తం 19 జట్లు.. టోర్నమెంట్ లో పాల్గొన్నాయి. ఈ నెల 27 వరకూ ఈ పోటీలు నిర్వహించనున్నట్లు.. నిర్వాహకులు తెలిపారు. విజేత జట్టుకు 60 వేల రూపాయలు, రెండో స్థానం సాధించిన జట్టుకు 30 వేలు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు.