పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ అమరావతి పరిరక్షణ కమిటీ ప్రజా చైతన్య యాత్ర జరగనుంది. ఈ యాత్రలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, అఖిలపక్షాల నేతలు, ఐకాస ప్రతినిధులు పాల్గొనున్నారు. కృష్టా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద నేతలకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకటంతో పాటు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో గణపవరం, ఉండి, భీమవరం, పాలకొల్లులో ఐకాస ప్రతినిధులు పర్యటించనున్నారు. రాజధాని మార్పు వల్ల కలిగే ఇబ్బందులు, అమరావతి ప్రయోజనాలను నేతలు వివరించనున్నారు. అంతకంటే ముందు ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు.
నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర - చంద్రబాబు వార్తలు
అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర జరగనుంది. తెదేపా అధినేత చంద్రబాబు యాత్రలో పాల్గొననున్నారు.
praja chaitanya yatra will be held in West Godavari district on Saturday