ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాలకొల్లు ఆస్పత్రిలో విద్యుత్​ అంతరాయం.. కరోనా రోగుల ఆందోళన - Power outage at Palakollu hospital in West Godavari District

ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో కొవిడ్ వార్డులోని బాధితులు ఆందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే నిమ్మల చొరవతో విద్యుత్​ సరఫరాను వేగంగా పునరుద్ధరించారు.

పాలకొల్లు ఆస్పత్రిలో విద్యుత్​ అంతరాయం.. హైరానా పడ్డ కరోనా రోగులు
పాలకొల్లు ఆస్పత్రిలో విద్యుత్​ అంతరాయం.. హైరానా పడ్డ కరోనా రోగులు

By

Published : May 12, 2021, 7:59 AM IST

ప.గో జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో తెల్లవారుజాము నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులు, భారీ వర్షంతో అర్ధరాత్రి తీగలు తెగిపడిన కారణంగా సరఫరా నిలిచిపోవడంతో కొవిడ్ బాధితులు భయబ్రాంతులకు గురయ్యారు.

వేగంగా స్పందించిన నిమ్మల..

విద్యుత్ ప్రవాహం లేకపోవడంతో సత్వరమే స్పందించిన తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం ఆస్పత్రిలోని జనరేటర్‌కు నిమ్మల మరమ్మతులు చేయించడంతో.. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ అయ్యింది. ఈ నేపథ్యంలో రోగులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చూడండి :పిల్లలపై కొవాగ్జిన్​ 2, 3 దశల క్లీనికల్​ ట్రయల్స్​!

For All Latest Updates

TAGGED:

palakollu

ABOUT THE AUTHOR

...view details