ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇక లేరు - నటుడు కృష్ణం రాజు మృతి
06:11 September 11
ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణంరాజు కన్నుమూత
ప్రముఖ నటుడు కృష్ణంరాజుకన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కృష్ణంరాజు , హైదరబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ..ఇవాళ తెల్లవారుజామున గం. 3.25 లకు తుదిశ్వాస విడిచారు. వాజ‌్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగానూ చేసిన కృష్ణంరాజు, తెలుగు చిత్రసీమలో రెబెల్ స్టార్ గా పేరుగడించారు. 1940 జనవరి 20న ప.గో. జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసి విలన్‌గానూ అలరించిన కృష్ణంరాజు.. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు.
ఇవి చదవండి :