ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువులో వ్యర్థాలు.. స్థానికులకు కష్టాలు - తాడేపల్లిగూడెం వార్తలు

తాడేపల్లిగూడెం పట్టణం కుంచినపల్లి సమీపంలోని వలసకుంట చెరువులో పురపాలక సిబ్బంది చెత్త వేస్తున్నారు. వారిని స్థానికులు అడ్డుకున్నారు. చెత్త తీసుకువచ్చిన వాహనాలను ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. వ్యర్థాల వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని గ్రామస్థులు వాపోయారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

pond-pollution
స్థానికులకు కష్టాలు

By

Published : Jan 22, 2021, 7:11 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న వలసకుంట చెరువులో పురపాలక సిబ్బంది వ్యర్థాలను వేస్తున్నారు. ఫలితంగా కుంచినపల్లి గ్రామస్థులు పురపాలక సిబ్బందిని అడ్డుకున్నారు. చెత్తను చెరువులో వేస్తున్నందునా నీరు కలుషితం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసన వల్ల అంతుచిక్కని రోగాలు వచ్చి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు. దోమలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. అధికారులు స్పందించి, చెరువులో చెత్త వెయ్యకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details