ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదివారం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష.. ఆ నిబంధనలు తప్పనిసరి! - పశ్చిమగోదావరి జిల్లాలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి పరీక్ష నిర్వహించేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు.

polycet exam at sunday
శ్రీనివాసరావు, పాలిసెట్ పశ్చిమగోదావరి జిల్లా కో కన్వీనర్

By

Published : Sep 26, 2020, 2:52 PM IST

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 5,956 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. జిల్లాలో 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తణుకు పరిసరాల్లో 12, భీమవరంలో 5, ఏలూరులో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తణుకులో 2,914 మంది, ఏలూరులో 1,392 మంది, భీమవరంలో 1,650 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

పరీక్షలకు సంబంధించి విద్యార్థులు శానిటైజర్, మాస్కులతో పాటు.. కరోనా లక్షణాలకు సంబంధించి ఎటువంటి అనారోగ్యాలు లేవని తల్లిదండ్రుల సంతకం ఉన్న డిక్లరేషన్ సమర్పించాలని అధికారులు తెలిపారు. కొవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాలు మార్చినందువల్ల ఈనెల 17వ తేదీ తర్వాత డౌన్​లోడ్ చేసుకున్న హాల్ టికెట్​తో మాత్రమే పరీక్షకు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఉదయం 9:30 గంటల కల్లా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని జిల్లా కో కన్వీనర్ శ్రీనివాసరావు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details