పశ్చిమగోదావరి జిల్లాలో పరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.
నరసాపురంలో
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో.. పరిషత్ ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు.. ఓటర్లు తరలివెళ్లారు.
తణుకులో
తణుకు, నిడదవోలు నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరోనా విజృంభిస్తుండటంతో.. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు శానిటైజర్లు అందజేయటంతో పాటు థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.
భీమవరం, ఉండిలో
భీమవరం, ఉండి నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో.. ఓట వేయటానికి ప్రజలు బారులు తీరారు. అయితే చాలా పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాలకొల్లులో
పాలకొల్లు నియోజకవర్గంలో.. పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.
ఇదీ చదవండి:తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది: చంద్రబాబు