పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతి పట్ల తెదేపా నేతలు జేసీ దివాకర్ రెడ్డి, కేశినేని నాని, బాపిరాజు, దెందులూరు వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని తదితరులు సంతాపం తెలిపారు. ఏలూరులోని మాగంటి నివాసంలో రాంజీ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ ఊరేగింపుగా రాంజీ అంతిమ యాత్ర కొనసాగింది. చాటపర్రు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతి పట్ల నేతల సంతాపం - eluru latest news
తెలుగుదేశం నేత మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మాగంటి నివాసంలో రాంజీ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతిపట్ల నేతల సంతాపం