ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటి దొంగలు: అలా పట్టుకుంటున్నారు.. ఇలా అమ్ముకుంటున్నారు! - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు

కంచె చేను మేస్తోంది అన్న చందంగా తయారయింది పోలీసులు పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా సరఫరా అవుతున్న మద్యాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని బయటకు విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.

Police stole the seized
Police stole the seized

By

Published : Sep 3, 2020, 3:35 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా టీ. నర్సాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 2019, 2020 సంవత్సరాల్లో మద్యం అక్రమ సరఫరాకు సంబంధించి మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. ఇందులో.. 407 మద్యం సీసాలు మాయం అయినట్లు ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లింది. ఏలూరు రేంజి డీఐజీ మోహన్ రావు, జిల్లా ఎస్పీ నారాయణ నాయక్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో.. ఈ విషయమై విచారణ జరిగింది.

మద్యం మాయం అయినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ స్నేహితకు అప్పగించారు. ఎస్సై ప్రేమ రాజు , హెడ్ కానిస్టేబుల్ పిట్ట మహేశ్వరరావు.. 407 మద్యం సీసాలు మద్యాన్ని బయటకు తరలించినట్లు డీఎస్పీ గుర్తించారు. ఉన్నత అధికారులకు నివేదిక సమర్పించారు. ఈ మేరకు ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి గురువారం ఉదయం వారిరువురిని సస్పెండ్ చేసినట్లు డీఐజీ మోహన్ రావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details