పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం - police-station
ఏలూరు పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకోవటం కలకలం సృష్టించింది. భార్య ఇంటికి రావడం లేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు.
భార్య ఇంటికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి... పోలీస్‌స్టేషన్‌లోనే బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ముత్యాల శివకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరి ఓ పాప ఉంది. భీమవరం శివారులోని చేపల చెరవులకు కాపలాదురులుగా వీరు పనిచేస్తున్నారు. శివ నిత్యం మద్యం తాగి భార్యను వేధిస్తుండేవాడు. విసిగిపోయిన భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏలూరులోని పోలీస్‌స్టేషన్‌లో భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగు నిర్వహించారు. అనంతరం భర్తతో ఇంటికి వెళ్లేందకు భార్య నిరాకరించింది. మనస్తాపం చెందిన శివ పోలీస్‌స్టేషన్‌లోనే బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. పోలీసులు అతడిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.