పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆస్తి కోసం చెల్లే ..అన్నను హత్య చేసింది. తన భర్త వీర కుమార్, మరో వ్యక్తితో కలసి హత్యకు పాల్పడ్డారు. ఎట్టకేలకు పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఏలూరుకు చెందిన శేఖర్ బాబు వారం రోజుల కిందట హత్యకు గురయ్యాడు. ఈ హత్య దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సొంత చెల్లెలే ఆస్తి కోసం హత్య చేసినట్లు రుజువైంది. అన్న చెల్లెలు మధ్య గత కొంత కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఆస్తిని దక్కించుకోవాలని శేఖర్ బాబును హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆస్తి కోసం అన్నను చంపిన చెల్లెలు అరెస్టు - ఏలూరులో హత్యకేసు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వారం రోజుల క్రితం హత్యకు గురైన శేఖర్ బాబు కేసును పోలీసులు ఛేదించారు. సొంత చెల్లే....ఆస్తి కోసం అన్నను చంపిందని పోలీసులు తెలిపారు.
ఆస్తి కోసం అన్నను చంపిన చెల్లే