ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ మద్యాన్ని సీజ్ చేసిన జిల్లా పోలీసులు - west godavari dst liquor news

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తనిఖీలు చేసిన పోలీసులు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే అక్రమమద్యాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన సరకు విలువ సుమారు లక్షరూపాయలు ఉంటుందని ఎక్సైజ్ సీఐ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు.

police seized telagana state liquor when transporting to andhrapradesh west godavarid dst
police seized telagana state liquor when transporting to andhrapradesh west godavarid dst

By

Published : May 23, 2020, 10:11 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 200 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ. లక్ష ఉంటుందని ఎక్సైజ్ సీఐ అజయ్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక కారు మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. పోలవరం మండలం ఎల్ ఎన్ డీ పేటలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారాకు ఉపయోగించే 1,600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details