పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు...22 మంది అరెస్ట్ - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 22 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి...వారి నుంచి రూ.లక్షా 42 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు...22 మంది అరెస్ట్
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 22 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,42,780 నగదుతో పాటు 23 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం అందడంతో.. పెనుకొండ సీఐ సునీల్ కుమార్ ఆధ్వరంలో ఈ దాడులు నిర్వహించారు. పేకాట, జూదం లాంటి ఆసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:
పశ్చిమగోదావరి జిల్లాలో తగ్గుతున్న అటవీ విస్తీర్ణం!
Last Updated : Mar 21, 2021, 10:18 PM IST