పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, పోలవరం, కొవ్వూరు పరిధిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిర్వహించిన దాడుల్లో నాటుసారా, తెలంగాణ మద్యం తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం మండలాల్లో 120 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్ట్ చేశారు. రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలవరం స్టేషన్ పరిధిలో 70 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కొవ్వూరు స్టేషన్ పరిధిలో 100 లీటర్ల నాటుసారా తరలిస్తున్న ఆటోను సీఐ శ్రీనివాసరావు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
తనిఖీల్లో భారీగా పట్టుబడుతున్న నాటుసారా - police raids on natusara vehiles in west godavari dst
పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు... నాటుసారా తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలను సీజ్ చేశారు.
Breaking News