పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలోని సారా తయారీ స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పోలవరం మండలం ఎల్ఎన్డీ పేటలో తనిఖీలు నిర్వహించి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 310 లీటర్ల సారాతో పాటు 1800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని సీఐ సత్యనారాయణ తెలిపారు. సారా తరలిస్తున్న వ్యక్తితో పాటు, బెల్లం సరఫరాదారుడిని అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం పరిధిలో సారా, తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ అజయ్కుమార్సింగ్ తెలిపారు. ఎవరైనా అక్రమ మద్యం తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. నలుగురి అరెస్టు - పశ్చిమగోదావరి జిల్లా నేర వార్తలు
మద్యం ధరలు భారీగా పెరగడంతో రాష్ట్రంలో సారా తయారీ స్థావరాలు పుట్ట గొడుగుల్లా వెలిశాయి. అక్రమంగా సారా తయారు చేస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేసి భారీగా సారాను స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. నలుగురు అరెస్టు