పశ్చిమగోదావరి జిల్లాలో ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని ఏడు చోట్ల దాడులు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ కరీమూల్లా షరీఫ్, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ జయరాజు తెలిపారు. జిల్లాలో మొత్తం 420 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 70,500 బెల్లపు ఊట ధ్వంసం చేసి 103 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 879 కేసులు నమోదు చేసి 1,153 మంది అరెస్ట్ చేసి వారి నుంచి 430 వెహికల్ స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్ తెలిపారు. జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై 63 కేసులు నమోదు చేసి 121 మందిని అరెస్టు చేశామని అన్నారు. 100 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 687 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. అక్రమంగా ఇసుక, మద్యం తరలిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. .
పశ్చిమగోదావరి జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ అధికారుల దాడులు.. - Jayaraj. Assistant Commissioner. Special Enforcement Bureau.
సంపూర్ణ మద్యపానం నిషేధం అమలు చేసేందుకు పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో అధికారులు జిల్లాలో బుధవారం ఉదయం విస్తృతంగా దాడులు నిర్వహించారు. పలు చోట్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, తెలంగాణ మద్యం స్వాధీనం చేసుకున్నారు.
విస్తృతంగా దాడులు.. బెల్లపు ఊటను ధ్వంసం , తెలంగాణ మద్యం స్వాధీనం