ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అడుగడుగునా ఆంక్షలు.. ఇబ్బందులు పడ్డ వైకాపా నాయకులు - సీఎం జగన్ ఏలూరు పర్యటన వార్తలు

ముఖ్యమంత్రి ఏలూరు పర్యటన సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షలతో సొంత పార్టీ నేతలు సైతం ఇబ్బందులు పడ్డారు. వైకాపా నేతలను సీఎం జగన్ పాల్గొనే కార్యక్రమంలో అనుమతించకపోవటంతో పలువురు ఎమ్మెల్యేలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

police provision
వైకాపా నేతలను అనుమతించని పోలీసులు

By

Published : Nov 4, 2020, 3:00 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పహారా కాస్తూ.. కఠిన ఆంక్షలు విధించారు. దీంతో వైకాపా నాయకులు సైతం ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో వామపక్ష పార్టీలు, రైతు సంఘ నాయకులను పోలీసులు గృహ నిర్భంధం చేశారు. ఆశ్రం క్రీడా మైదానం వద్ద, హెలీప్యాడ్, ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమంలో వైకాపా నేతలను కూడా పోలీసులు అనుమతించలేదు. ఈ కారణంతో పలువురు ఎమ్మెల్యేలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పాసులు ఉన్నా కొన్నిచోట్ల మీడియాను సైతం పోలీసులు అడ్డుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details