ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీఎంవో జాబితాలో రఘురామ పేరు లేదు.. చట్టప్రకారం వ్యవహరిస్తాం : డీఐజీ - mp raghu rama tour shedule

raghu rama
raghu rama

By

Published : Jul 3, 2022, 8:58 PM IST

Updated : Jul 3, 2022, 10:00 PM IST

20:55 July 03

వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు విషయంలో.. చట్ట ప్రకారం వ్యవహరిస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అన్నారు. రేపు (సోమవారం) భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటానని ఎంపీ రఘురామరాజు ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. రఘురామ భీమవరం రాకపై డీఐజీ పాలరాజు స్పందించారు.

రఘురామ భీమవరం వస్తున్నట్లు తమకు సమాచారం లేదని చెప్పారు. అంతేకాదు.. పీఎంవో నుంచి వచ్చిన జాబితాలోనూ ఎంపీ రఘురామ పేరు లేదని స్పష్టం చేశారు. ఎంపీ రఘురామ వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకుంటామన్న డీఐజీ.. చట్టప్రకారమే వ్యవహరిస్తామని చెప్పారు.

ఇవీ చూడండి :

Last Updated : Jul 3, 2022, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details