తమ గ్రామానికి రాకపోకలు సాగించేందుకు ఇబ్బందిగా ఉందని, రహదారికి మరమ్మతులు చేయాలంటూ పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం అడవికొలనులో గ్రామస్థులు పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. గ్రామస్థులపై లాఠీఛార్జ్ చేసి, కొందరిని అరెస్టు చేశారు. జనసేన పార్టీకి చెందిన వ్యక్తి సర్పంచ్‌గా ఉండడం వల్లే తమ గ్రామానికి రోడ్డు వేయడం లేదని నిరసనకారులు ఆరోపించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై లాఠీఛార్జ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రహదారికి మరమ్మతులు చేయమంటే పోలీసులు లాఠీఛార్జ్ చేశారు..! - west godavari district crime
తమ గ్రామానికి రహదారి వేయమని కోరగా పోలీసులు లాఠీచార్జ్ చేశారని పశ్చిమగోదావరి జిల్లా అడవికొలను గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరిని అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారని అన్నారు.
రహదారికి మరమ్మతులు చేయాలని కోరితే... పోలీసులు లాఠీఛార్జ్ చేశారు..!