అల్లారుముద్దుగా చూసుకుంటున్న ఆ చిన్నారిని అనారోగ్యం పీడించింది. ఆస్పత్రిలో వైద్యం అందించినప్పటికీ.. తగ్గకపోవడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. పాప పడుతున్న అవస్థ చూడలేకపోయింది. పొంగుకు వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని చిన్నారిని నీటి తొట్టెలో వేసి హత్య చేసింది. ఈ విషాద ఘటన ఏలూరులో జరిగింది.
BABY DEATH CASE: చిన్నారి మృతి కేసు ఛేదన.. నిందితురాలు ఎవరంటే.. - eluru latest news
14:39 August 12
ఏలూరులో చిన్నారి అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు
కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్ సమీపంలోని రేమల్లెకు చెందిన హరికృష్ణ, సీతామహాలక్ష్మి దంపతులు. వీరి పాపకు ఆరోగ్యం క్షీణించడంతో.. రెండు రోజుల క్రితం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అవసరమైన వైద్యం అందించి డిశ్ఛార్జ్ చేశారు. చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. పాప ఆచూకీ కనిపించలేదు. సమీపంలో వెతకగా.. నీటి తొట్టెలో శవమై కనిపించింది. ఈ ఘటనపై బాధితురాలు ఆస్పత్రి యాజమాన్యానికి సమాచారం అందించగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాపను ఎవరైనా హత్య చేశారా..? లేదా ప్రమాదవశాత్తుగా జరిగిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. చిన్నారిని నీటి తొట్టెలో వేసి హత్య చేసింది తల్లేనని తేల్చారు. పాప అనారోగ్యాన్ని చూడలేకనే హత్య చేసినట్లు తల్లి సీతామహాలక్ష్మి ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీచదవండి.