ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ రహదారిపై గుంతలు పూడ్చివేయించిన పోలీసులు - పశ్చిమగోదావరి వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లాలో జాతీయ రహదారిపై గుంతలను పోలీసులు పూడ్చివేయించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో మరమ్మతులు చేసినట్లు వారు చెప్పారు.

ీీ
జాతీయ రహదారిపై గుంతలు పూడ్చివేత

By

Published : Feb 10, 2021, 10:30 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి నుంచి దర్భగూడెం వరకు జాతీయ రహదారిపై ఉన్న గోతులను పోలీసులు మట్టితో పూడ్చివేయించారు. గోతుల వల్ల రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకు స్వచ్ఛందంగా గుంతలు పూడ్పించామని ఎస్సై విశ్వనాథ బాబు తెలిపారు.

సుమారు 6 కిలోమీటర్ల వ్యవధిలో వందలాది గోతులను మట్టితో పూడ్చి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి శాశ్వతంగా గోతులు నిర్మూలించి వాహనచోదకుల ఇబ్బందులను తొలగించడానికి కృషి చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details