పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామ శివారులోని ఆలయ ఆవరణలో ఈనెల 21న జరిగిన ఆలయ పూజారి కొత్తలంక వెంకట నాగేశ్వరశర్మ హత్య కేసును పోలీసులు చేధించారు. ఆస్తి తగాదాల కారణంగా నాగేశ్వర శర్మ తమ్ముడి కుమారుడు కొత్తలంక వీరవెంకట సుబ్రహ్మణ్య సుమంత్ మరో నలుగురితో కలిసి ఈ హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నిడదవోలు సీఐ తెలిపారు.
సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను సీఐ వెల్లడించారు. 'మృతుడు పూజారి నాగేశ్వరశర్మ, అతని తమ్ముడి మధ్య చాలాకాలంగా ఆర్థిక విషయాల్లో తగాదాలున్నాయి. పలు పర్యాయాలు పెద్దల సమక్షంలో చర్చించినా పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో తమ్ముడు కొడుకు పెదనాన్నపై కక్ష పెంచుకున్నాడు. పెదనాన్నను చంపేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించాడు.