తణుకు సర్కిల్ పరిధిలో పోలీసులు పహారా కాస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసు నమోదు చేస్తున్నారు. మాస్కులు లేకుండా వాహనాలపై తిరుగుతున్న 60 మందిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 30 మందిపై కేసులు నమోదు చేశారు. సడలింపులు ఇచ్చినా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసు నమోదు చేస్తామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనకాడబోమని ఇంచార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు హెచ్చరించారు.
నిబంధనలు అతిక్రమిస్తే కేసులే - పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాజా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. రోజులు వందల మందిపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సైతం వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసుల కేసులు