పశ్చిమగోదావరి జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఏలూరుకు చెందిన నాగేంద్ర, నూకరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 14 లక్షల రూపాయలు విలువ చేసే 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరు.. ఏలూరు పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. షాపింగ్ మాల్స్, ఇతర రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చాకచక్యంగా దొంగలించే వారని పోలీసులు తెలిపారు.
ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగల అరెస్ట్ - పశ్చిమగోదావరి జిల్లా నేర వార్తలు
పశ్చిమగోదావరి జిల్లాలో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు