పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జునుడు పాలెం గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితులను ఇరగవరం పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన వట్టి కొండయ్యను అతని భార్య, అత్త కలిసి చీరతో గొంతు బిగించి హత్య చేశారు. కొండయ్య మద్యానికి బానిసై వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో విసిగిపోయి ఘాతుకానికి పాల్పడినట్లు భార్య రామలక్ష్మి, అత్త పార్వతి వెల్లడించారు. ఈనెల ఆరో తేదీన జరిగిన సంఘటనలో నిందితులైన భార్య, అత్తలను అరెస్టు చేసి, రిమాండ్కు తరలిస్తున్నట్లు ఇరగవరం పోలీసులు తెలిపారు.
భర్తను హత్య చేసిన భార్య... సహకరించిన అత్త అరెస్టు - crime news in west godavari dst
పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జునుడు పాలెంలో భర్తను చంపిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. మద్యానికి బానిసై వేధిస్తుండటంతో హత్య చేసినట్లు భార్య రామలక్ష్మి అత్త పార్వతి తెలిపారు. నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు.
police arrested culpits of murder case in west godavari dst