ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేను పోలీస్​ అన్నాడు.. అసలు పోలీసులకు చిక్కాడు - పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ పోలీస్​ తాజా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పోలీస్​ అని చెప్పి డబ్బులు వసూలు చేస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రఘు హెచ్చరించారు.

duplicate police arrested by police
తాడేపల్లిగూడెంలో నకిలీ పోలీస్​ అరెస్టు

By

Published : Feb 20, 2020, 5:19 PM IST

తాడేపల్లిగూడెంలో నకిలీ పోలీస్​ అరెస్టు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పోలీస్​ అని చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడుతోన్న కుడిపూడి నాగేంద్రబాబు (25) అనే వ్యక్తిని పట్టణ పోలీసులు అరెస్ట్​ చేశారు. గతంలో నాగేంద్రబాబుపై 36 కేసులు నమోదు అయినట్టుగా సీఐ ఆకులు రఘు తెలిపారు. తాడేపల్లిగూడెంలోని తాళ్ల ముదునూరు పాడులో ఓ వ్యక్తిని బెదిరించి వసూళ్లకు పాల్పడుతుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులమని చెప్పి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని సీఐ సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details