పోలవరం జలాశయం నుంచి కుడికాలువకు మరింత నీటిని మళ్లించేందుకు వీలుగా టన్నెళ్ల సామర్థ్యం పెంపునకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకుగానూ టన్నెళ్ల ఆకృతులను ముంబయి ఐఐటీ నిపుణుల సాయంతో రూపొందించారు. ఈ ప్రతిపాదనలతో ఒక నివేదికను సిద్ధం చేసి జల వనరులశాఖలోని కేంద్ర ఆకృతుల సంస్థ సీఈకి సమర్పించారు. అక్కడ అధ్యయనం పూర్తయ్యాక తుది ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్తాయి.
పోలవరం టన్నెళ్ల సామర్థ్యం పెంపునకు ఐఐటీ ఆకృతి - పోలవరం టన్నెళ్లకు ముంబాయి ఐఐటీ ఆకృతి
పోలవరం నుంచి కుడికాలువకు మరింత నీటిని మళ్లించేందుకు టన్నెళ్ల సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం టన్నెళ్ల ఆకృతులను ముంబయి ఐఐటీ నిపుణులతో రూపొందించారు. పోలవరం జలాశయం నుంచి కుడి కాలువకు 50 వేల క్యూసెక్కులు నీటిని మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.
పోలవరం టన్నెళ్ల సామర్థ్యం పెంపునకు ఐఐటీ ఆకృతి
పోలవరం జలాశయం నుంచి కుడి కాలువకు 50వేల క్యూసెక్కుల నీటిని మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న 2 టన్నెళ్ల వ్యాసం 11.8 మీటర్లుగా ఉండగా వీటి ద్వారా 20వేల క్యూసెక్కులే పంపేందుకు వీలుంది. వీటి సామర్థ్యాన్ని 17.8 మీటర్ల వ్యాసానికి పెంచితే రెండింటి నుంచి తలో 25 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించొచ్చు.
ఇదీ చదవండి :'వాటర్ బాటిళ్లు, మజ్జిక ప్యాకెట్లకు రూ.43.44 లక్షలా.. ఇదేం దోపిడీ?'