పోలవరం ఎడమ కాల్వ అనుసంధానం, సొరంగం పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు...టెక్నికల్ బిడ్లను తెరిచారు. ఇనిషియల్ బెంచ్ విలువ రూ.274.55 కోట్లు కాగా... మాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ 15.6 శాతం తక్కువగా కోట్ చేసింది.
రివర్స్ టెండర్‌తో పోలవరం 65వ ప్యాకేజీ పనిలో రూ.58.53 కోట్లు మిగులు సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో రూ.276 కోట్ల విలువైన పనిని.. 4.77 శాతం అధిక ధర రూ.290 కోట్లకు మాక్స్ ఇన్‌ఫ్రాకు ఇచ్చారని వెల్లడించారు. ఇదే పనికి రివర్స్ టెండర్ ప్రక్రియ నిర్వహించగా.. 15.6 శాతం తక్కువగా రూ.231 కోట్లకు పని చేస్తామంటూ మాక్స్ ఇన్‌ఫ్రా కంపెనీ ముందుకొచ్చింది. మొత్తంగా పోలవరం 65వ ప్యాకేజీ పనిలో ప్రభుత్వానికి రూ.58.53 కోట్లు మిగిలాయి. రివర్స్ టెండరు ప్రక్రియలో ఆరు కంపెనీలు పాల్గొన్నాయని అధికారులు తెలిపారు.