పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అన్నారు. ఆయన నేతృత్వంలోని బృందం కాఫర్ డ్యాం, స్పిల్ వే క్రస్ట్ గేట్లు అమరిక పనులను ఆదివారం పరిశీలించింది. ప్రాజెక్టు పనుల వివరాలను ఈ బృందానికి ఇంజినీర్లు వివరించారు. అనంతరం అయ్యర్ మీడియాతో మాట్లాడారు.
స్పిల్‌వేతో పాటు అన్ని పనులు నిర్ణీత కాలంలోనే పూర్తి చేస్తాం. మేము 4 రోజులు ఇక్కడే ఉండి పనులను పరిశీలిస్తాం. రేపు, ఎల్లుండి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో సహాయ పునరావాస చర్యలను పరిశీలిస్తాం. తర్వాత కుడి, ఎడమ కాలువల పనులతో పాటు అన్ని అంశాలనూ పరిశీలిస్తాం. ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో మంచి అవగాహనతో ముందుకెళ్తున్నాం. ఇదే స్ఫూర్తితో మా పని వేగాన్ని పెంచుతాం. షెడ్యూల్ ప్రకారం పనులన్నీ పూర్తి చేస్తాం- చంద్రశేఖర్ అయ్యర్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో