యువత చెడు వ్యసనాలను విడనాడి లక్ష్యాన్ని నిర్దేశించుకుని గమ్యాన్ని చేరాలని పోలవరం డీఎస్పీ లతాకుమారి సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం గూడెంలో గిరిజన యువతకు ఆమె క్రీడా పరికరాలు అందజేశారు. మన్యం ప్రాంతంలో పేకాట, కోడి పందేలు, నాటుసారా తయారీ వంటివాటిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. పోలీస్ ఉద్యోగాలకు కావలసిన పుస్తక సామగ్రిని ఉచితంగా అందజేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజా వ్యతిరేక పనులు రూపు మాపేలా యువత సిద్ధం కావాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. అసాంఘీక కార్యకలాపాలు అరికట్టడంలో యువత ముందుండాలని ఆమె పేర్కొన్నారు.
'ప్రజాస్వామ్య వ్యవస్థలో యువకులు కీలక పాత్ర పోషించాలి' - DSP Lata Kumari distributes sports equipment to tribal youth
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం గూడెంలో గిరిజన యువకులకు స్థానిక డీఎస్పీ లతాకుమారి క్రీడా పరికరాలు అందజేశారు. యువత చెడు వ్యసనాలను విడనాడి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. మన్యం ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించి సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకపాత్ర పోషించాలని యువకులకు సూచించారు.
యువకులు కీలక పాత్ర పోషించాలి