ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అఖండ గోదావరిలో... కాఫర్ డ్యామ్​లు నిలుస్తాయా? - polavaram copper dams latest news

పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్​లపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మట్టి, రాళ్లతో నిర్మించిన కాఫర్ డ్యామ్ లు అఖండ గోదావరిలో నిలుస్తాయా అన్న ప్రశ్న అందరిలోను తలెత్తుతోంది. దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి తెలియజేస్తారు.

Polavaram_Copper_Dams latest details
అఖండ గోదావరిలో... అసంపూర్తిగా ఉన్న కాఫర్ డ్యామ్​లు నిలుస్తాయా?

By

Published : Dec 15, 2019, 10:22 AM IST

అఖండ గోదావరిలో... అసంపూర్తిగా ఉన్న కాఫర్ డ్యామ్​లు నిలుస్తాయా?

పోలవరం ప్రాజెక్టులో భాగంగా కాఫర్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టారు. గోదావరినదికి అడ్డంగా వీటిని నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి అనువుగా వీటిని నిర్మిస్తున్నారు. రాక్ ఫిల్ డ్యామ్ కు ఎగువ దిగువున కాఫర్ డ్యామ్ లు నిర్మాణం పూర్తిచేసి.. గ్రావీటితో నీటిని అందించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. గోదావరి వరదను స్పిల్​వే వైపు మళ్లించటం వల్ల.. రాక్ ఫిల్ డ్యామ్ పూర్తి చేయవచ్చని అధికారులు భావించారు. దీంతో కాఫర్ డ్యామ్ పనులు శరవేగంగా చేశారు. ఆగమేఘాలతో మట్టి, రాళ్లతో నిర్మించిన కాఫర్ డ్యామ్ లు అఖండ గోదావరిలో నిలుస్తాయా అన్న ప్రశ్న అందరిలోను తలెత్తుతోంది. అసంపూర్తిగా ఉన్న ఈ నిర్మాణాలు కొట్టుకుపోతాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details