ప్రాజెక్టు పనుల పురోగతి సహా పలు అంశాలను చర్చించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) హైదరాబాద్‌లో ఈ నెల 10వ తేదీన సమావేశం కానుంది. పోలవరం అథారిటీ అధికారులతోపాటు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటివరకు ఎంత పని జరిగింది, ఏమేమి పెండింగ్‌లో ఉన్నాయన్నది చర్చించి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు డిజైన్ల ఖరారు, గతంలో గుత్తేదారుల నుంచి తొలగించిన పనులను మళ్లీ టెండర్లు పిలిచి అప్పగించడం తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి.
Polavaram meet: 10న పోలవరం అథారిటీ సమావేశం - polavaram construction latest news
ఈ నెల 10వ తేదీన పోలవరం అథారిటీ సమావేశం జరగనుంది. ప్రాజెక్టు పనుల పురోగతి సహా పలు అంశాలను సమావేశంలో చర్చించనున్నారు.
Polavaram meet
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి డిస్ట్రిబ్యూటరీ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, కుడి కాలువ వైపు డిస్ట్రిబ్యూటరీల సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా ఇంకా తయారు కాలేదు. నిర్వాసితులకు సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే, చేసిన పనులకు బిల్లుల చెల్లింపు, పోలవరం వద్ద కొత్తగా ప్రతిపాదించిన ఎత్తిపోతల తదితర అంశాలను కూడా ఎజెండాలో చేర్చారు.
ఇదీ చదవండి: