2014 ఏప్రిల్ 1వ తేదీ నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తుందంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) స్పష్టం చేసింది. భూసేకరణ, పునరావాస, పరిహార ప్యాకేజీలతో ఉన్న ఇరిగేషన్ కాంపోనెంట్ చెల్లించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సమాచార హక్కు చట్టం కింద దాఖలైన అర్జీకి పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పందిస్తూ ఈ సమాధానం ఇచ్చింది.
పోలవరం నిర్మాణ ఖర్చులపై పీపీఏ భిన్న సమాధానాలు - పోలవరం ప్రాజెక్టు తాజా వార్తలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై దాఖలైన ఆర్టీఏ దరఖాస్తులకు ప్రాజెక్టు అథారిటీ భిన్న సమాధానాలు పంపింది. ఏప్రిల్‌లో సమాచార హక్కు చట్టం కింద దాఖలైన అర్జీకి...2014 ఏప్రిల్ 1వ తేదీ నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చు కేంద్రమే భరిస్తోందని సమాధానం ఇచ్చింది. సెప్టెంబరులో దాఖలైన మరో అర్జీకి.. 2013-14 ధరల ప్రకారం ఇరిగేషన్ కాంపోనెంట్‌కు మాత్రమే నిధులు చెల్లించనున్నట్లు సమాధానమిచ్చింది.
Polavaram authority
అమలాపురానికి చెందిన రమేశ్ కుమార్ సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన అర్జీకీ పీపీఏ జవాబు పంపింది. అయితే సెప్టెంబర్‌లో దాఖలైన మరో ఆర్టీఐ దరఖాస్తుకు మరో భిన్నమైన సమాధానం ఇచ్చింది పీపీఏ. 2013-14 ధరల ప్రకారం ఇరిగేషన్ కాంపోనెంట్‌కు మాత్రమే నిధులు చెల్లిస్తామని అర్జీలో పీపీఏ సమాధానం ఇచ్చింది. నాలుగు నెలల్లోనే పీపీఏ నుంచి భిన్నమైన సమాధానం రావటంపై నిపుణుల్లో చర్చ సాగుతోంది.
ఇదీ చదవండి :ముగిసిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం