పోడు భూములకు అటవీ హక్కుల పత్రాలు మంజూరు చేసి, గిరిజనుల కుటుంబాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెలుగులు నింపారని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం శాసనసభ్యుడు తెల్లం బాలరాజు అన్నారు. టీ. నరసాపురం మండలం మర్రిగూడెంలో గిరిజనులకు పోడు భూములకు సంబంధించిన పత్రాలు పంపిణీ చేశారు.
గిరిజనుల కుటుంబాల్లో వెలుగులు నింపారు: ఎమ్మెల్యే బాలరాజు - news updates in west godavari district
పశ్చిమగోదావరి జిల్లా మర్రిగూడెంలో పోడు భూములకు సంబంధించి గిరిజనులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలరాజు హాజరయ్యారు. గిరిజనులు పట్టాలు ఇచ్చి, వారి కుటుంబాల్లో ముఖ్యమంత్రి వెలుగులు నింపారని ఆయన అన్నారు.
గిరిజనులకు పట్టాల పంపిణీ కార్యక్రమం
గత 40 ఏళ్ల నుంచి సాగు చేస్తున్న 109 మంది రైతులకు సాగు పట్టాలు అందజేశామని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. వీటి ద్వారా రైతు భరోసా, వైఎస్సార్ జలకళ, పథకాల ఫలాలు అందుతాయని పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు భూములు పంచారని గుర్తు చేశారు.
ఇదీచదవండి.