PM Felicitates Alluri Family Members: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సభా ప్రాంగణం నుంచే వర్చువల్ ద్వారా విగ్రహావిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లూరి వారసులను ప్రధాని సన్మానించారు. "ఆజాదీకా అమృత్ మహోత్సవ్"లో భాగంగా భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు.
అల్లూరి వారసులను ఘనంగా సన్మానించిన ప్రధాని మోదీ - అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అల్లూరి వారసులను ప్రధాని నరేంద్ర మోదీ సన్మానించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అల్లూరి ఉత్సవాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన వారసులను ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. సభా వేదిక ముందు మొదటి వరుసలో అల్లూరి కుటుంబీకులు కూర్చున్నారు. సీతారామరాజు సోదరుడు సత్యనారాయణ రాజు కుమారుడైన శ్రీరామరాజును వేదికపై ప్రధాని మోదీ సన్మానించారు. అలాగే.. అల్లూరి అనుచరులు మల్లుదోర మనుమడు బొడ్డు రాజును శాలువతో సత్కరించారు. అనంతరం వాళ్లకు వందనాలు తెలిపారు. జయంతి వేడుకల్లో అల్లూరి కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. దేశ ప్రధాని చేతుల మీదుగా సన్మానం చేయడం పట్ల అల్లూరు కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: దేశభక్తుల పురిటిగడ్డ ఆంధ్ర.. అల్లూరి స్ఫూర్తిని కొనసాగించాలి : ప్రధాని మోదీ