సాగునీరు కోసం పంటకాలువకు పూడికతీత - denduluru
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పంట కాలువకు రైతులు యంత్రం సహాయంతో పూడికలు తీయించుకున్నారు.

సాగునీరు కోసం పంటకాలువకు పూడికతీత
సాగునీరు కోసం పంటకాలువకు పూడికతీత
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో రైతులు పంట కాలువకు పూడికతీత పనులు చేశారు. ఎన్టీఆర్ కూడలి మీదుగా జాతీయ రహదారి వెంబడి ఉన్న పొలాలకు సాగునీరు వచ్చేందుకు యంత్రంతో పూడికలు తీయించారు. పలుచోట్ల అక్రమ నిర్మాణాలు ఉన్నందున అధికారలకు ఫిర్యాదు చేసి ఇరిగేషన్, రెవెన్యూ పోలీసు శాఖల సహకారంతో పనులు పూర్తి చేశారు. సుమారు పదేళ్ల తర్వాత పూడిక తీశారని.. కొన్నేళ్ల పాటు సాగునీటి సమస్య ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.