Petrol Rates Increased: పెట్రో ఉత్పత్తుల ధరలను రోజురోజుకు పెంచుతూ ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపుతున్నాయి. గత వారం రోజుల నుంచి ఐదుసార్లు.. ఐదు రూపాయలకు పైగా పెట్రోల్ ధరలు పెరగడంతో వినియోగదారులు సతమతమవుతున్నారు. సామాన్య ప్రజలకు పెరుగుతున్న చమురు ధరలు గుదిబండలా మారాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ప్రజలపై ధరల పెంపును భాజపా ప్రభుత్వం ప్రారంభించిందని కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారు.
Petrol Rates Increased: సామాన్యుడికి శాపంలా మారిన పెట్రో ధరలు
Petrol Rates Increased: పెట్రో ఉత్పత్తుల ధరలను రోజురోజుకు పెంచుతూ ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో లీటరుకు ఐదు రూపాయలకు పైగా పెట్రోల్ ధరలు పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
సామాన్యుడికి శాపంలా మారిన పెట్రో ధరలు
పశ్చిమగోదావరి జిల్లాలో రోజుకు మూడు లక్షల లీటర్ల పెట్రోలు, ఎనిమిది లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతుంది. ప్రస్తుతం పెరిగిన ధరలతో వినియోగదారులపై సుమారు 40 లక్షల రూపాయలకు పైగా అదనపు భారం పడుతుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: పాత గాజువాక జంక్షన్‌లో తెదేపా-వైకాపా నాయకుల ఘర్షణ...తోపులాట