పశ్చిమగోదావరి జిల్లా రాజుపోతేపల్లి అడ్డ రోడ్డులో ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంక్‌లో కల్తీ పెట్రోలు విక్రయిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. కల్తీ పెట్రోలు వాడటం వల్ల గత పది రోజుల్లో తమ ద్విచక్ర వాహనాలు పాడైపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏలూరు ఏఎస్ వో ప్రతాప్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పెట్రోలు శాంపిల్ తీసి పరిశీలించారు. తేడా ఉన్నట్లు అనుమానం రావడంతో ఆయన పెట్రోలు బంక్‌ను సీజ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
రాజుపోతేపల్లిలో పెట్రోలు బంక్ సీజ్ - రాజుపోతేపల్లిలో పెట్రోలు బంక్ సీజ్ వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా టీ నరసాపురం మండలం రాజుపోతేపల్లి అడ్డరోడ్డులో స్థానికులు ఆందోళన చేపట్టారు. పెట్రోల్ బంక్‌లో కల్తీ పెట్రోలు విక్రయిస్తున్నారంటూ మండిపడ్డారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెట్రోలు బంక్‌ను సీజ్ చేశారు.
రాజుపోతేపల్లిలో పెట్రోలు బంక్ సీజ్