ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటిలో క్రిమిసంహారకాల అవశేషాలు - ఏలూరు తాజా వార్తలు

ఏలూరులో వందలమంది అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురవడంతో ఆ నగరంలోని నాలుగు ప్రాంతాలతో పాటు.. కృష్ణా, గోదావరి కాలువల్లోని నీటి నమూనాల్ని అధికారులు సేకరించారు. వీటిని విజయవాడలోని ఒక ప్రయోగశాలలో పరీక్షించగా విస్మయపరిచే ఫలితాలు వచ్చాయి.

మూర్ఛపోయిన యువతిని ఆస్పత్రికి తరలిస్తున్న ఆస్పత్రి సిబ్బంది
మూర్ఛపోయిన యువతిని ఆస్పత్రికి తరలిస్తున్న ఆస్పత్రి సిబ్బంది

By

Published : Dec 9, 2020, 7:01 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వందలమంది అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురవడంతో ఆ నగరంలోని నాలుగు ప్రాంతాలతో పాటు.. కృష్ణా, గోదావరి కాలువల్లోని నీటి నమూనాల్ని అధికారులు సేకరించారు. వీటిని విజయవాడలోని ఒక ప్రయోగశాలలో పరీక్షించగా విస్మయపరిచే ఫలితాలు వచ్చాయి. ఆ నీటిలో హానికరమైన రసాయనాలు, క్రిమిసంహారకాల అవశేషాలు పరిమితికి మించి అనేక వేల రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. కృష్ణా, గోదావరి కాలువలతో పాటు నగరంలోని రామచంద్రరావుపేట, గాంధీ కాలనీ, పెన్షన్‌ లైన్‌ ఏరియా, జె.పి.కాలనీల్లో నీటి నమూనాల్ని అధికారులు పరీక్షించారు. అన్ని చోట్లా క్రిమిసంహారకాల అవశేషాలు భారీ మోతాదులో ఉన్నట్టు తేలింది. వాటిలో కలుపు మొక్కల నివారణకు వాడే మందులు, దోమలు, ఈగలు, బొద్దింకలతో పాటు, పంటల్ని ఆశ్రయించే చీడపీడల్ని నివారించేందుకు వినియోగించే... అలాక్లోర్‌, మెథాక్సీక్లోర్‌, ఓపీ-డీడీటీ, పీపీ-డీడీఈ, ఓపీ-డీడీడీ, పీపీ-డీడీడీ వంటి క్రిమిసంహారకాలు వేల రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. వైద్య ప్రమాణాల ప్రకారం ఈ క్రిమిసంహారకాల అవశేషాలేవీ తాగే నీటిలో ఉండకూడదు.

17,640 రెట్లు ఎక్కువ...!
కృష్ణా కాలువలో తీసుకున్న నమూనాల్లో... లీటరు నీటిలో 17.64 మిల్లీ గ్రాముల మెథాక్సీక్లోర్‌ ఉన్నట్టు తేలింది. ఈ రసాయనం తాగునీటిలో అసలు ఉండకూడదు. 0.001 మిల్లీ గ్రాముల కంటే తక్కువ మోతాదులో ఉంటే పెద్దగా హానికరం కాదు. అంటే అక్కడ 17,640 రెట్లు అధికంగా ఉంది. దీన్నిబట్టి అక్కడ ప్రమాద తీవ్రత ఎంతుందో అర్థమవుతోంది. ఈ రసాయనం తాగునీరు, ఆహారం ద్వారా ప్రజల శరీరంలోకి వెళితే దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు కారణమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఏలూరులో నీటి నమూనాలు పరీక్షించిన ప్రాంతాలు... బయటపడ్డ రసాయనాల వివరాలు..!
ఏలూరులోని వివిధ ప్రాంతాల్లో తీసుకున్న నమూనాల్లో బయటపడ్డ రసాయనాలు అన్నీ ఒక లీటరుకి 0.001 శాతం కంటే తక్కువే ఉండాలి. అంతకు దాటితే ప్రమాదకరం. నీటి నమూనాల్లో ప్రాంతాల వారీగా బయటపడ్డ విషపూరిత రసాయనాల పరిమాణాలు ఇలా ఉన్నాయి.

ఇదీ చదవండి

ఏలూరు ఘటనపై పూర్తి స్థాయిలో పరిశోధించండి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details