ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్సాహంగా పేరుపాలెం బీచ్​ ఫెస్టివల్​.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు - beach festival celebrations in ap

పశ్చిమగోదావరి జిల్లాలో బీచ్​ ఫెస్టివల్​ ఉత్సాహంగా సాగుతోంది. పేరుపాలెంలో రెండో రోజు కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు అవంతి శ్రీనివాస్​, తానేటి వనిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫెస్టివల్​లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఉత్సాహంగా పేరుపాలెం బీచ్​ ఫెస్టివల్​.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్సాహంగా పేరుపాలెం బీచ్​ ఫెస్టివల్​.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

By

Published : Feb 17, 2020, 3:51 AM IST

అలరించిన బీచ్​ ఫెస్టివల్​

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్​లో బీచ్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతోంది. రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని, పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్​, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు బీచ్ ఫెస్టివల్ ప్రతీకగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. ఈ సందర్భంగా బీచ్​ ఫెస్టివల్​ నిర్వహణకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును అభినందించారు. పేరుపాలెం బీచ్​ను వైఎస్ఆర్ బీచ్​గా తీర్చిదిద్ది అవసరమైన మౌలిక వసతులు కల్పించి.. రిసార్ట్స్ నిర్మించి అభివృద్ధి చేస్తామని పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్​ అన్నారు. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి జగన్​ ఉద్దేశమని నరసాపురం ఎమ్మెల్యే తెలిపారు. తనకు పశ్చిమగోదావరి జిల్లాతో ఎనలేని సంబంధం ఉందని చెప్పారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

బీచ్ ఫెస్టివల్​లో భాగంగా నిర్వహించిన 5 కె రన్ కబడ్డీ పోటీల విజేతలకు మంత్రులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో షరీఫ్ మిమిక్రీ, సినీ నటి పాయల్ రాజ్​పుత్,​ జబర్దస్త్ హైపర్ ఆది, మొగలిరేకులు ఫేమ్​ అంజలి యాంకరింగ్​ వివిధ రకాల నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి.

ABOUT THE AUTHOR

...view details