కామవరపుకోట మండలం రామన్నపాలేనికి చెందిన బంటుమిల్లి నాగార్జున( 34) ద్వారకాతిరుమల మండలం వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన సుస్మితను 2 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల పెద్దల సమక్షంలో విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో భార్య విడాకులు ఇస్తానని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్థాపానికి గురైన నాగార్జున సోమవారం వెంకటకృష్ణాపురంలోని తన అత్తారింటికి వచ్చి పురుగుల మందు తాగాడు .అతడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ద్వారకాతిరుమల ఎస్ఐ దుర్గా మహేశ్వర రావు తెలిపారు.
భార్య విడాకులిస్తానంటే.. ఆత్మహత్య చేసుకున్నాడు! - భార్య విడాకులిస్తాననడంతో భర్త ఆత్మహత్య వార్తలు
భార్య విడాకులు ఇస్తాననడంతో భర్త మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం వెంకటకృష్ణాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
భార్య విడాకులిస్తానంటే.. ఆత్మహత్య చేసుకున్నాడు!