ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో లైన్​మెన్​ సహాయకుడు మృతి - లక్కవరంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ట్రాన్స్​ఫార్మర్​ ఫ్యూజును బిగిస్తుండగా విద్యుదాఘాతంతో ముక్కపాటి రామకృష్ణ అనే వ్యక్తి​ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

person died due to electric shock in west godavari district
మృతి చెందిన ముక్కపాటి రామకృష్ణ

By

Published : Jul 12, 2020, 8:28 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో విద్యుదాఘాతంతో ముక్కపాటి రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను లక్కవరం సబ్​స్టేషన్​ లైన్​మెన్​కు సహాయకుడిగా పనిచేస్తున్నాడు. బాట గంగానమ్మ ఆలయం వద్ద ట్రాన్స్​ఫార్మర్​ ఫ్యూజు పోయింది. గ్రామస్థులు రామకృష్ణను పిలవగా... అతడు స్తంభం ఎక్కి మరమ్మతు చేస్తున్న సమయంలో విద్యుత్​ సరఫరా జరిగి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details