పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు శుభ కార్యాలు నిర్వహించుకోవడానికి దేవస్థానం వెసులుబాటు కల్పించిందని ఆలయ ఈఓ భ్రమరాంబ వెల్లడించారు.
పెళ్లిళ్లు..పేరంటాలకు అనుమతి..
భక్తులు వివాహాలు, ఉపనయనాలు అన్నప్రాసన తదితర శుభకార్యాలను జరుపుకోవడానికి అనుమతిస్తున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి ఆలయంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు నిషేధించినట్లు పేర్కొన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.