యువకుడిపై నిర్దాక్షిణ్యంగా లాఠీఛార్జ్ చేసిన పశ్చిమగోదావరి జిల్లా పెరవలి ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది. లాక్‌డౌన్ నేపథ్యంలో తండ్రీ కుమారుడు సహా ఓ వృద్ధురాలిపైనా ఎస్‌ఐ కిరణ్‌కుమార్ లాఠీఛార్జ్ చేశాడు. లాఠీఛార్జ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో... యూనిట్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎస్సై వ్యవహారం డీజీపీ గౌతం సవాంగ్ దృష్టికి వెళ్లింది. విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌కు పంపించాలి తప్ప.. దాడి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే.. తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెరవలి ఎస్‌ఐ ఓవరాక్షన్‌పై డీజీపీ ఆగ్రహం..సస్పెన్షన్ వేటు - news on west godavari lock down
లాక్‌డౌన్ నేపథ్యంలో యువకుడిపై లాఠీఛార్జ్ చేసిన పశ్చిమగోదావరి జిల్లా పెరవలి ఎస్‌ఐ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ ఎస్సై వ్యవహారం డీజీపీ గౌతం సవాంగ్ దృష్టికి వెళ్లింది. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యువకుడిపై లాఠీచార్జ్... ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు