పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఆధార్ అనుసంధానం కోసం జారీ చేసే కూపన్ల కోసం ముందురోజు రాత్రి 9 గంటల నుంచే జనం బారులు తీరుతున్నారు. ఆధార్ అనుసంధానం కాకపోతే బియ్యం సరఫరా నిలిచిపోతుందని, ఇతర సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వాలంటీర్లు చెబుతున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన వారందరికీ టోకెన్లు ఇవ్వకుండా.. కేవలం 50 మందికి మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆధార్-ఈకేవైసీతో కష్టాలు.. అనుసంధాన కేంద్రాల వద్ద పడిగాపులు - west godavari district latest news
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆధార్-ఈకేవైసీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియ చేపడుతున్న కేంద్రాల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు.
ఆధార్-ఈకేవైసీతో కష్టాలు