పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు శివారు గ్రామం కోడేరు లంక. అక్కడ రెండు వార్డుల్లో సుమారు 500 మంది జనాభా ఉంటారు. మూడు వందల మంది ఓటర్లున్నారు. గోదావరి చెంతనే ఉన్న ఈ ప్రాంతం ప్రజలు ఓటు వేయాలంటే నదిని దాటుకుని కోడేరు గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంవత్సరాల తరబడి మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవట్లేదంటూ లంక ప్రజలు వాపోతున్నారు. దీంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు.
కోడేరు లంకలో పోలింగ్ కేంద్రం లేక ప్రజల అవస్థలు - people faced difficulties due to no polling station in koderu lanka news
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు పంచాయతీ పరిధిలోని కోడేరు లంక గ్రామస్థులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని లంక వాసులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా... ఫలితం లేదని వాపోతున్నారు.
పోలింగ్ కేంద్రం లేక ప్రజల అవస్థలు