పశ్చిమ గోదావరి జిల్లాలో రేషన్ సరుకుల కోసం లబ్ధిదారులు బారులు తీరారు. ఉదయం 6 గంటలకే పంపిణీ మొదలైంది. స్థానిక వీఆర్వోలు వారికి కేటాయించిన దుకాణాల్లో బయోమెట్రిక్ ద్వారా సరుకులు ఇస్తున్నారు. పంచదారకు మాత్రమే రూ. 10 వసూలు చేస్తున్నారు. బియ్యం, పప్పు ఉచితంగా ఇస్తున్నారు. జిల్లాలోని పోతునూరు, దెందులూరు, గోపన్నపాలెం తదితర గ్రామాల్లో ప్రజలు ఎండలోనే నిలబడి సరుకులు తీసుకెళ్లారు.
రేషన్ కోసం జనం బారులు - People barrels for ration
రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం మెుదలైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో రేషన్ సరుకుల కోసం చౌకధరల దుకాణాల వద్ద కార్డుదారులు సామాజిక దూరం పాటించి సరుకులు తీసుకున్నారు.
రేషన్ కోసం జనం బారులు