ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛను అందలేదని వృద్ధుల ఆందోళన

కడపునుపుట్టినోళ్లు లేరు... కట్టుకున్న భర్త లేడు. ఈ వయసులో చూసుకోడానికి నా అనే వాళ్లు ఎవ్వరూ లేరు. గవర్నమెంటోళ్లు ఇచ్చే డబ్బులతోనే మందులు తెచ్చుకుని బతుకుతున్నా.... అలాంటిది కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని పింఛను ఇవ్వలేదు. నేను ఎలా బతుకతాను.. నాకు దిక్కెవరు అంటోంది... పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన 5 పదులు నిండిన వెంకాయమ్మ

pensioners  protest in west godavari dst for their money
పింఛను రాలేదని జంగారెడ్డిగూడెంలో అందోళన చేస్తున్న లబ్ధిదారులు

By

Published : Feb 4, 2020, 12:03 AM IST

Updated : Feb 4, 2020, 5:16 PM IST

పింఛను రాలేదని జంగారెడ్డిగూడెంలో అందోళన చేస్తున్న లబ్ధిదారులు

ప్రభుత్వం అందించే పింఛను ఈ నెల చాలమంది లబ్ధిదారులకు రాలేదు. అనేక కారణాలతో వారికి పింఛను సొమ్మును అధికారులు ఆపేశారు. మందులు తెచ్చుకోవాలన్నా, నాలుగు మెతుకులు తినటానికి అంగట్లో సరుకులు కొనాలన్నా, పండగకు మనవళ్లకు పదో పరకో ఇవ్వాలన్నా, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు ఆధారం ఆ పింఛను సొమ్మే. అలాంటిది అధికారులు కరెంట్​ మీటర్​ రీడింగ్ 300 యూనిట్లు​ వస్తుందని... 3 సెంట్లలో ఇల్లు ఉందని కారణాలు సాకుగా చూపి తమ పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పింఛను అందని బాధితులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ... తమకు పెన్షన్​ ఇప్పించండని వాపోయారు.

Last Updated : Feb 4, 2020, 5:16 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details